ఈవీఎంలపై రేవంత్రెడ్డి ఫొటో!! | tdp leader revanth reddy photo seen on evm | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై రేవంత్రెడ్డి ఫొటో!!

Published Wed, Apr 30 2014 11:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

ఈవీఎంలపై రేవంత్రెడ్డి ఫొటో!! - Sakshi

ఈవీఎంలపై రేవంత్రెడ్డి ఫొటో!!

మహబూబ్నగర్ జిల్లా కొడంగంల్ నియోజకవర్గంలోని కొన్ని ఈవీఎంలపై టీడీపీ అభ్యర్థి రేవంత్రెడ్డి ఫొటో ఉండటం తీవ్ర వివాదానికి కారణమైంది.

మహబూబ్నగర్ జిల్లా కొడంగంల్ నియోజకవర్గంలోని కొన్ని ఈవీఎంలపై టీడీపీ అభ్యర్థి రేవంత్రెడ్డి ఫొటో ఉండటం తీవ్ర వివాదానికి కారణమైంది. నియోజకవర్గ పరిధిలోని కోహ్లి మండలం బాలికల ఉన్నత పాఠశాలలో గల 102, 104 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలతో పాటు, ఓటర్ల జాబితాలో కూడా రేవంత్ రెడ్డి ఫొటో కనిపించింది.

దీనిపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మక్కు కావడం వల్లే ఇలా జరిగిందని వారు ఆరోపించారు. తీవ్రస్థాయిలో ఆందోళన చేసి పోలీసు అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఫొటోలు తీయించేశారు. ఆ తర్వాత అక్కడ పోలింగ్ సజావుగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement