టీడీపీ- బీజేపీ పొత్తులో ప్రతిష్టంభన | tdp bjp alliance not yet finalised | Sakshi
Sakshi News home page

టీడీపీ- బీజేపీ పొత్తులో ప్రతిష్టంభన

Mar 20 2014 7:54 PM | Updated on Aug 11 2018 4:07 PM

టీడీపీ- బీజేపీ పొత్తులో ప్రతిష్టంభన - Sakshi

టీడీపీ- బీజేపీ పొత్తులో ప్రతిష్టంభన

తెలుగుదేశం పార్టీ- బీజేపీల మధ్య పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది.

తెలుగుదేశం పార్టీ- బీజేపీల మధ్య పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో తమకు 65 ఎమ్మెల్యే టికెట్లు, 11 ఎంపీ టికెట్లతో పాటు సీఎం అభ్యర్థి కూడా తమవాళ్లే ఉండాలన్న షరతులకు అంగీకరిస్తేనే పొత్తు ఉంటుందని బీజేపీ పట్టుబడుతోంది. సరిగ్గా ఇదే అంశం మీద ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు సమాచారం.

ఈ రెండు పార్టీల మధ్య పొత్తును ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం కూడా హైదరాబాద్‌లోనే ఉండబోతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షుటు, పదాధికారులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement