రెబెల్స్ | Rebels | Sakshi
Sakshi News home page

రెబెల్స్

Apr 2 2014 4:04 AM | Updated on Mar 18 2019 9:02 PM

రెబెల్స్ - Sakshi

రెబెల్స్

సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తున్న వారు ఓ వైపు... పార్టీలతో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమైన అభ్యర్థులు మరో వైపు నిలబడి ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు.

సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తున్న వారు ఓ వైపు... పార్టీలతో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమైన అభ్యర్థులు మరో వైపు నిలబడి ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఇరువైపుల నుంచి సుడిగాలిలా దూసుకొస్తున్న ఈ ముప్పు ప్రధాన పార్టీల గెలుపోటములపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా రెబల్స్ బరిలో ఉండటం ఆయా పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. స్వతంత్రులను   ఏదో విధంగా మచ్చికచేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పార్టీలోని రెబల్స్‌ను ఏవిధంగా బుజ్జగించాలో తెలియని అయోమయ పరిస్థితి అభ్యర్థుల్లో నెలకొంది.

 ఓట్ల చీలికతో ఫలితాలు తారుమారు...

 గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెబల్స్, స్వతంత్రులు ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. 2006 ఎన్నికల్లో 815  ఎంపీటీసీ స్థానాలకు గాను స్వతంత్రులు 513 మంది బరిలో ఉన్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో 835 స్థానాలకు 649 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆ ఎన్నికల్లో  జెడ్పీటీసీ 59  స్థానాలకు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఈ ఎన్నికల్లో వారి సంఖ్య ఏకంగా 125కు పెరగడం గమనార్హం. ఈ పోటీతత్వం కాంగ్రెస్, టీడీపీలలో ఎక్కువగా కనిపిస్తోంది.

జిల్లా రాజకీయాల్లో ఈ రెండు పార్టీల్లో గ్రూపులు తారాస్థాయికి చేరడం ఎన్నికల్లో పోటీ తత్వానికి దారితీసింది. దీంతోఈ ఎన్నికల్లో  రెబల్స్.. తమకు ఉన్న పలుకుబడితో ఓట్లను పొందగలిగితే..అన్ని ప్రధాన పార్టీల ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement