
సీమాంధ్రుల సభలను అడ్డుకోండి: పొన్నం
తెలంగాణలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ అలాంటి సభలను అడ్డుకోవాల్సిన అవసరముందని తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభను ఎందుకు అడ్డుకోలేదని టీఆర్‌ఎస్, టీఎన్‌జీవో నాయకులను ఆయన ప్రశ్నించారు.