'కేసీఆర్కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం' | ponnala lakshmaiah slams kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం'

May 3 2014 3:02 PM | Updated on Mar 18 2019 9:02 PM

'కేసీఆర్కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం' - Sakshi

'కేసీఆర్కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం'

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని, అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టారని ఆయన  అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని పొన్నాల శనివారమిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అయితే గెలుపు టీఆర్ఎస్దేనంటూ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.

గెలిపిస్తే సేవ... లేకుంటే విశ్రాంతన్న కేసీఆర్కు ఇప్పుడిక విశ్రాంతే శరణ్యమని పొన్నాల ఎద్దేవా చేశారు. కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి సహకరించలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూలంకషంగా పరిశీలిస్తామన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే, వర్థన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ అస్వస్థతకు గురయ్యారన్నారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పొన్నాల తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement