'సొంత తమ్ముడే చిరంజీవిని నమ్మడం లేదు' | Own brother is not trusted Chiranjeevi | Sakshi
Sakshi News home page

'సొంత తమ్ముడే చిరంజీవిని నమ్మడం లేదు'

Mar 25 2014 4:30 PM | Updated on Mar 22 2019 5:33 PM

'సొంత తమ్ముడే చిరంజీవిని నమ్మడం లేదు' - Sakshi

'సొంత తమ్ముడే చిరంజీవిని నమ్మడం లేదు'

సొంత తమ్ముడు పవన్ కళ్యాణే కేంద్ర మంత్రి చిరంజీవిని నమ్మడంలేదని, ఇక ప్రజలు ఏం నమ్ముతారు? అని వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగిరెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్: సొంత తమ్ముడు పవన్ కళ్యాణే కేంద్ర మంత్రి చిరంజీవిని నమ్మడంలేదని, ఇక ప్రజలు ఏం నమ్ముతారు? అని వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగిరెడ్డి ప్రశ్నించారు. చెన్నైలో తన వియ్యంకుడి ఇంట్లో దొరికిన 70 కోట్ల రూపాయల కేసు ఏమైందో చిరంజీవి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి తన పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్నారని విమర్శించారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు నకిలీ నోట్లలాంటివని విమర్శించారు. తన పాలన మళ్లీ తెస్తానని చంద్రబాబు చెప్పగలరా? అని  నాగిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement