రాజంపేటలో టీడీపీకి షాక్‌ | Madan Mohan reddy resigns to tdp | Sakshi
Sakshi News home page

రాజంపేటలో టీడీపీకి షాక్‌

Apr 29 2014 2:10 PM | Updated on Aug 10 2018 8:06 PM

రాజంపేట నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. రాజంపేట నియోజకవర్గంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి సేవ చేసిన వారికి గాక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మదన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా రాజంపేట లోక్సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement