తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు.
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్కడిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకే మోడీ, పవన్‌కల్యాణ్, కాంగ్రెస్, కిరణ్‌కుమార్‌రెడ్డి, జయప్రకాష్ నారాయణ్, సీపీఐలతో పొత్తులకోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. జూపూడి శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఒక్కడిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఉందా అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాలకపక్షం విఫలమైనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాల్సిన టీడీపీ.. నిన్నటిదాకా పాలకపక్షాన్ని భుజాలపై మోసిందని దుయ్యబట్టారు. మళ్లీ ఎన్నికలోచ్చేసరికి ఒక్కడుగా పోటీ చేయలేక పవన్, మోడీ, జేపీ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వాళ్లందరితో పొత్తు కట్టినా ప్రజలు మాత్రం జగన్ పక్షానే ఉండాలని నిర్ణయం తీసేసుకున్నారని జూపూడి పేర్కొన్నారు.