
ఆశగాఆగాల్సిందే
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇంకా సమయం ఉండడంతో ఈ మధ్య కాలంలో వారు కాసింత సేదదీరుతున్నారు.
- జూన్‌లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
- ప్రస్తుతం విజయోత్సవాల్లో బిజీబిజీ
- నియోజకవర్గాల్లో ర్యాలీలు, కార్యకర్తలతో సమావేశాలు
- మొక్కులు తీర్చుకోవడంలో కొందరు నిమగ్నం
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇంకా సమయం ఉండడంతో ఈ మధ్య కాలంలో వారు కాసింత సేదదీరుతున్నారు. నెలన్నరగా కంటిమీద కునుకులేకుండా రాత్రీపగలూ విజయం కోసం శ్రమించిన నేతలు ఫలితాల తరువాత కాసింత రిలాక్స్ అయ్యారు. ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో చాలామంది అభ్యర్థులు అసలు తాము గెలుస్తామో లేదోనని బెంగపెట్టుకున్నారు. మరికొందరైతే ఆశలు వదిలేసుకున్నారు.
తీరా ఫలితాలు అనుకూలంగా రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. విజేతలు తమ అనుయాయులు, ఆత్మీకుల కార్యకర్తలతో కలిసి ఆనందక్షణాలు పంచుకుంటున్నారు. శుక్రవారం ఫలితాలు వెలువడ్డంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయాలి. కాని రాష్ట్ర విభజన జరగడంతో ప్రస్తుతం అధికారులంతా శాఖల విభజన, ఇతరత్రా ఏర్పాట్లలో ఉండడం, జూన్ 2న రెండురాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం ఉండడంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా అప్పటివరకు వాయిదా పడింది. దీంతో కొత్త ఎమ్మెల్యేలంతా జూన్ రెండో వారం వరకూ ఆగక తప్పడం లేదు.
దీంతో ఈ ఖాళీ సమయంలో మండలాల వారీగా సభలు, అభినందన సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకు ఎక్కడెక్కడ ఓట్లు తక్కువ పడ్డాయి? ఎక్కడ అనుకూలంగా పడ్డాయనేదానిపై విశ్లేషించుకుంటున్నారు. మరికొందరు రోడ్డుషోలు, విజయోత్సవాలు జరుపుతున్నారు. ఇప్పటికే విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమం,భీమిలి, గాజువాక, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, పెం దుర్తి, చోడవరం, మాడుగులలో అభ్యర్థులు తమ అనుచరులు, కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు.
సోమవారం విశాఖ దక్షిణంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. కొందరు టీడీపీ అభ్యర్థులు గెలిచిన తర్వాత చంద్రబాబును కలవడానికి వెళ్లారు. గెలిచి న ఆనందం పంచుకోవడంతోబాటు మంత్రి పదవు ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లా నుం చి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, అ య్యన్న పాత్రుడు, గంటా తదితరులున్నారు. కొత్త ఎమ్మెల్యే లూ బాబును కలిసి తమ అదృష్టాన్ని పరీ క్షించుకోనున్నారు.
మరికొందరైతే తిరుపతి, షిర్డీ వెళ్లి మొక్కు లు తీర్చుకుంటున్నారు. మరికొందరు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు నియోజకవర్గాల్లో తాము ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేసుకుని ముందు ఏయే పనులు చేయాలనేదానిపై ప్రాథమ్యాలు ఎంచుకుం టున్నారు. అధికంగా నిధులు ఖర్చయిన యలమంచిలి, అనకాపల్లి, గాజువాక, పాయకరావుపేట, విశా ఖ ఉత్తరం, విశాఖతూర్పు నియోజకవర్గా ల్లో గె లిచి న అభ్యర్థులు మాత్రం అంచనాలు మిం చిపోయిన ఎన్నికల ఖర్చులపై కసరత్తు చేసుకుంటున్నారు.