నరసాపురం.. రసవత్తరం | interesting in narsapuram | Sakshi
Sakshi News home page

నరసాపురం.. రసవత్తరం

Mar 24 2014 2:30 AM | Updated on Oct 16 2018 6:33 PM

నరసాపురం మునిసిపల్ ఎన్నికల పోరు హోరాహోరీ కానుంది. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే విశ్లేషణలతో ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి.

నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్: నరసాపురం మునిసిపల్ ఎన్నికల పోరు హోరాహోరీ కానుంది. ఈ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే విశ్లేషణలతో ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా మారింది. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీలో చేరడంతో మరింత బలం చేకూరింది.
 
 ఇదిలా ఉండగా అయిదేళ్లుగా పట్టణంలో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టోంది. పట్టణంలో సరైన నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారిం దట. పట్టణంలోని 31 వార్డులకు గాను అత్యధిక వార్డుల్లో  వైసీపీ పట్టు బిగించింది. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య ఉన్నా 16 వార్డుల్లో వైసీపీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
టీడీపీ అభ్యర్థులను ముందుగా ప్రకటించినా ఆర్థికంగా బలమైన వారు కాకపోవడం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోందట. దీంతో స్వతంత్ర అభ్యర్థులపై గేలం వేయడానికి తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
 
 నువ్వా..నేనా..
వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రత్యర్థి పార్టీని తలదన్నేవారిని వార్డు అభ్యర్థులుగా ఎంపిక చేశారని, దీంతో విజయం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 31 వార్డులకు గాను 29 వార్డుల్లో వైసీపీ, టీడీపీ తలపడుతున్నాయి. 13, 16 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేరు. 16 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 11 వార్డుల్లో టీడీపీ, నాలుగు వార్డుల్లో ఇరుపార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.
 
 వైసీపీకు మత్స్యకారుల మద్దతు
 వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ద్వార సత్యశివప్రసాదరావు (సాయినాథ్‌ప్రసాద్) 14 వార్డు నుంచి పోటీచేస్తున్నారు. ఇక్కడ మత్స్యకార ఓటర్లే కీలకం. మత్స్య కార సంఘ పట్టణ అధ్యక్షుడు అద్దంకి వెంకటేశ్వరరా వు మద్దతు తెలపడంతో సాయినాథ్‌ప్రసాద్ గెలుపు తథ్యమని నాయకులు భావిస్తున్నారు.
 
 7 వార్డులో టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పసుపులేటి రత్నమాల పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమె స్వతంత్ర అభ్యర్థి చెన్నా వెంకట రామయ్య(రమేష్) నుంచి గట్టిపోటీని ఎదుర్కోనున్నారు. రమేష్ ఎమ్మెల్యే కొత్తపల్లి అనుచరుడిగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో ఆయనకు ప్రజల మద్దతు మెండుగా ఉంది. ఈ వార్డులో తమ అభ్యర్థిని బరిలో దింపకుండా రమేష్‌కు వైసీపీ మద్దతు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement