మోడీ కన్నా నేనే బెటర్! | i am better to modi | Sakshi
Sakshi News home page

మోడీ కన్నా నేనే బెటర్!

Apr 22 2014 4:52 AM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీ కన్నా నేనే బెటర్! - Sakshi

మోడీ కన్నా నేనే బెటర్!

పరిపాలనలో గుజరాత్ సీఎం నరేంద్రమోడీ కన్నా తానే ఉత్తమం అని తమిళనాడు సీఎం, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు.

చెన్నై: పరిపాలనలో గుజరాత్ సీఎం న రేంద్రమోడీ కన్నా తానే ఉత్తమం అని తమిళనాడు సీఎం, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. తమిళనాడులోని 40 లోక్‌సభ నియోజకవర్గాలు, పుదుచ్చేరిలో 51 రోజులపాటు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జయలలిత సోమవారం ప్రచారాన్ని ముగించారు. జయ సోమవారమిక్కడ ర్యాలీతో తన ప్రచారాన్ని ముగిస్తూ.. తమ పార్టీకే ఓటు వేయాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఏఐఏడీఎంకే వచ్చే కేంద్రప్రభుత్వంలో భాగం అయ్యేలా చేయాలని ఓటర్లను కోరారు.

గుజరాత్‌లో మోడీ కన్నా తమిళనాడులో స్త్రీ (జయ) పాలనే ఉత్తమం అంటూ పలు గణాంకాలతో వివరించారు. గుజరాత్ కన్నా తమిళనాడే ముందంజలో ఉందని, ఎవరు మంచి పరిపాలకులో చెప్పాలంటూ ప్రజలను ప్రశ్నించారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపైనా అవినీతి, ఇతర అంశాలను లేవనెత్తుతూ జయ ధ్వజమెత్తారు. ప్రచార ర్యాలీల్లో జయలలిత తొలుత యూపీఏ పైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో.. బీజేపీకి సానుకూలంగా ఉన్నారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్‌డీఏతో చేరతారన్న ఊహాగానాలు వచ్చాయి. దీంతో మోడీ, బీజేపీలపైనా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement