జిల్లాలో భారీగా పెరిగిన ఓటర్లు | heavily increased voters in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో భారీగా పెరిగిన ఓటర్లు

Apr 19 2014 2:27 AM | Updated on Oct 17 2018 6:06 PM

నూతన గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,53,288 గా నమోదైంది. మార్చి తొమ్మిది వరకు కొత్తగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను కలుపుకొని తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: నూతన గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,53,288 గా నమోదైంది. మార్చి తొమ్మిది వరకు కొత్తగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను కలుపుకొని తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. 48,523 మంది కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేరాయి. ఫిబ్రవరిలో అధికారికంగా ఓటర్ల సంఖ్య జిల్లా వ్యాప్తంగా 18,04,765గా నమోదైంది.

ప్రస్తుతం కొత్త ఓటర్లతో సంఖ్య పెరిగిపోయింది. ఆర్మూర్ నియోజకవర్గంలో 4,038 మంది, బోధన్ 4,289, జుక్కల్‌లో 3,083, బాన్సువాడలో 3,520, ఎల్లారెడ్డిలో 3,206, కామారెడ్డిలో 3,797, నిజామాబాద్ అర్బన్‌లో 14,511, నిజామాబాద్ రూరల్‌లో 7,189, బాల్కొండ నియోజకవర్గంలో 4,096 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement