రాహుల్ వైఫల్యం వల్లే ప్రచారంలోకి ప్రియాంక | Due to the failure of the campaign, Rahul because of comes in Priyanka | Sakshi
Sakshi News home page

రాహుల్ వైఫల్యం వల్లే ప్రచారంలోకి ప్రియాంక

May 1 2014 2:50 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్ వైఫల్యం వల్లే ప్రచారంలోకి ప్రియాంక - Sakshi

రాహుల్ వైఫల్యం వల్లే ప్రచారంలోకి ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఘోరంగా విఫలయ్యారని...ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఆయన సోదరి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వంలో తెరపైకి తెచ్చిందని బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత ఉమా భారతి ఎద్దేవా చేశారు.

ఝాన్సీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఘోరంగా విఫలయ్యారని...ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఆయన సోదరి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వంలో తెరపైకి తెచ్చిందని బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత ఉమా భారతి ఎద్దేవా చేశారు. ప్రియాంక చేస్తున్న విమర్శలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని...

రాహుల్ విఫలమయ్యారనేందుకు ఇదే నిదర్శమని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అయితే ప్రియాంకకు ఎటువంటి రాజకీయ హోదా లేనందున ఆమె విమర్శలకు బదులివ్వబోనన్నారు. యూపీలోని ఝాన్సీ నుంచి పోటీ చేస్తున్న ఉమాభారతి...ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఐటీ హబ్‌గా మారుస్తానన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement