స్థానిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ | Contest the samaikyandhra party in local elections | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ

Mar 19 2014 4:08 AM | Updated on Sep 2 2017 4:52 AM

స్థానిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ

స్థానిక ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ

నియోజకర్గంలోని అన్ని మండలాల్లోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటించారు.

ఆచంట, న్యూస్‌లైన్ : నియోజకర్గంలోని అన్ని మండలాల్లోనూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రకటించారు.
 
 స్థానిక కమ్మ కల్యాణ మండపంలో మంగళవారం ఆచంట, పోడూరు మండలాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర పార్టీ నిర్మాణం ఇంకా జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని నాయకులను, క్యాడర్‌ను కోరారు.
 సమైక్యాంధ్ర అభ్యర్థులను ఓడిస్తామని కాంగ్రెస్‌కు చెందిన కొందరు ప్రకటనలు చేయడం సిగ్గుచేటని అన్నారు.  స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఎన్ని ఎంపీపీలు, ఎన్ని జెడ్పీటీసీలు గెలుచుకుంటుందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. సమైక్య సదస్సుకు నియోజకవర్గం నుంచి తరలి రావడంతోపాటు, తనకు అండగా నిలిచినవారికి ఈ సందర్భంగా పితాని కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆచంట మండల అధ్యక్షునిగా తమ్మినీడి ప్రసాదును నియమిస్తున్నట్టు ప్రకటించారు.
 
 డీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు కండిబోయిన సత్యనారాయణ, భీమలాపురం, పెదమల్లం, కందరవల్లి, కరుగోరుమిల్లి సర్పంచ్‌లు చింతపర్తి సత్యనారాయణ, కె వీరాస్వామి, గుండుబోయిన సతీష్, ముత్తాబత్తుల రామచంద్రుడు నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement