పోస్టల్ బ్యాలెట్ రూటు ఎటో! | Sakshi
Sakshi News home page

పోస్టల్ బ్యాలెట్ రూటు ఎటో!

Published Sun, May 11 2014 12:38 AM

పోస్టల్ బ్యాలెట్ రూటు ఎటో!

ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉద్యోగుల తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయమై  సర్వత్రా ఉత్కం ఠ రేగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో అష్టకష్టాలు పడిన ఉద్యోగ వర్గాలు  ఎంతమాత్రం ఆ పార్టీకి అనుకూలంగా ఉండరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 15 నియోజకవర్గాల్లోని ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధుల్లో 21,461 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో
 
 19,578 మంది పోస్టల్ బ్యాలెట్లను తీసుకున్నారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 17 వేలకు పైగా పోస్టల్ బ్యాలెట్‌లు రిటర్నింగ్ అధికారుల కార్యాలయూలకు చేరాయి. ఉద్యోగులు ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యేలోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయూల్లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో బ్యాలెట్ వేసే అవకాశం కల్పించారు. అంటే ఈనెల 16వ తేదీన ఉదయం 7గంటలలోగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజున ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు.
 
 కౌంటింగ్ ముగిశాక అభ్యర్థుల వారీగా వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎంలలో వచ్చిన ఓట్లను కలిపి తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి ఎక్కువేగత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగానే పోలయ్యూయని అధికార వర్గాల భోగట్టా. కౌంటింగ్ ప్రారంభమయ్యే లోగా మరిన్ని ఓట్లు పోలవుతారుు. మొత్తంగా ఏయే నియోజకవర్గాల్లో ఎన్నెన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయనేది కౌంటింగ్ అనంతరం గాని వెల్లడి కాదు. ప్రతి నియోజకవర్గంలోను అభ్యర్థుల జాతకాలను తేల్చే విషయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ప్రభావం చూపుతారుు. ఇప్పటివరకూ ఏలూరు నియోజకవర్గం పరిధిలో 2,300 వరకు పోస్టల్ బ్యాలెట్లు పడినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట వెయ్యికి పైగా పోస్టల్ బ్యాలెట్ల వినియోగం జరిగింది.
 
 వైఎస్సార్ సీపీకే అనుకూలం
 వివిధ  శాఖల ఉద్యోగుల మధ్య జరుగుతున్న చర్చలను బట్టిచూస్తే వారిలో అత్యధిక శాతం మంది వైఎస్సార్ సీపీకే అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. కొన్నిచోట్ల వీటిని కొనడానికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే, కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచన మేరకు ఉద్యోగులంతా ఆత్మప్రభోదం మేరకే ఓటు వేసినట్టు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement