సీమాంధ్రలో కాంగ్రెస్ ఘోర పరాభవం | Congress humiliated defeat in seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో కాంగ్రెస్ ఘోర పరాభవం

May 12 2014 10:49 AM | Updated on Mar 18 2019 9:02 PM

సీమాంధ్రలో కాంగ్రెస్ ఘోర పరాభవం - Sakshi

సీమాంధ్రలో కాంగ్రెస్ ఘోర పరాభవం

రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీమాంధ్ర ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. దీంతో కాంగ్రెస్ ఒక్క మునిసిపాల్టీని కూడా గెలిచి పరిస్థితి కనిపించడం లేదు.

హైదరాబాద్: ఊహించినట్టే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం మూటగట్టుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా చతికిలపడింది. నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోతోంది.

రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీమాంధ్ర ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. దీంతో కాంగ్రెస్ ఒక్క మునిసిపాల్టీని కూడా గెలిచి పరిస్థితి కనిపించడం లేదు. అంతేగాక చాలా మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ కనీసం బోణీ కూడా కొట్టలేని దుస్థితి ఏర్పడింది. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ సీమాంధ్రలో ఏ జిల్లాలో కూడా మొత్తం అన్ని వార్డులు కలిపినా పదికి మించి నెగ్గలేదు. కొన్ని జిల్లాల్లో కనీసం ఒక్క వార్డు కూడా గెలవకపోడం కాంగ్రెస్ దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement