ఏం చేద్దాం! | congress defeated in telangana politics | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం!

May 21 2014 2:20 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఏం చేద్దాం! - Sakshi

ఏం చేద్దాం!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇచ్చిన చేదు ఫలితాలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊహిం చని ఫలితాల దిగ్భ్రమ నుంచి ఆ పార్టీ దిగ్గజా లు ఇంకా తేరుకోవడం లేదు. ‘తెలంగాణ’ ఏ ర్పాటును సా నుకూలంగా మార్చుకోలేకపోయామన్న బాధతోపాటు, రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ ఆ పార్టీ నేతలలో సాగుతోంది.

తెలంగాణ  రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటు చేయనుండగా, తమ వ్యూ హం ఏమిటో తేల్చుకోలేకపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు, ఫలితాల నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనలో వారు పడిపోయారు. రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం సాగుతుండగా, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేందుకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు డీసీసీ సన్నాహాలు చేస్తోంది.
 
 ఇంతటి ఘోర పరాజయమా!
 సార్వత్రిక ఎన్నికలలో ఊహించని ఫలి తాల నుంచి కాంగ్రెస్ సీనియర్లు ఇంకా తేరుకోలేదు. అన్ని స్థానాలలో ఘోర పరాజయం పొందడంపై ఇంకా ‘పోస్టుమార్టం’ సాగుతోంది. నిజామాబాద్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న మధుయాష్కీ, సురేశ్ షెట్కార్ ఓటమి కూడా వారిని ఆలోచనలో పడవేసింది. కొద్దిగా ప్రశాంతత కోసం కేడర్‌కు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన ధర్మపురి శ్రీనివాస్(డీఎస్), మహ్మద్ షబ్బీర్‌అలీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ‘అసలేం జరిగిందో’నని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. గెలుపు ధీమాలో ఉన్న ఈ ముగ్గురు నేతలకు ఓటమితో ఊహించని షాక్ తగిలింది. బాల్కొండ నుంచి ఆర్మూరుకు మారడంతో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డికి కలిసి రావడం లేదు. ఆయన కూడా వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోవడం లేదు. ఈరవత్రి అనిల్ సైతం ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు.
 
 గ్రూపుల పోరూ కొంప ముంచింది.
 జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రతికూల ఫలితా లు రావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రె స్ కమిటీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, సరైన మార్గదర్శనం, ప్లానింగ్ లేకపోవడంతోనే ఫలితాలు దారుణం గా వచ్చాయంటున్నారు. టీపీసీసీ తీరుపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలంగాణ’కు కాంగ్రెస్ అధిష్టానం అనుకూలంగా వ్యవహరిం చిన అంశాన్ని ప్రచారంలో సానుకూలం గా మార్చుకోవడంలో టీపీసీసీ వైఫల్యం చెందిందన్న ఆరోపణలున్నాయి.

ఇది లా ఉంటే జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు ల పోరు, ప్రత్యర్థులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ‘తెలంగాణ ’ ప్రకటన సందర్భంగా పలు జిల్లాల్లో నేతలం తా కలిసికట్టుగా ‘కృతజ్ఞత’సదస్సులు నిర్వహించగా.. జిల్లాలో మాత్రం గ్రూపు రాజకీయాల నడుమ సంబరాలు జరుపుకోవడం అప్పట్లో చర్చనీయాం శం అయ్యింది. డీఎస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్ వేర్వేరుగా సదస్సులు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తుందని ప్రచారం కూడ జరిగింది. ఇవన్నీ సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపగా.. ఇప్పటికైనా గ్రూపులు వీడుతారా? అన్న చర్చ కూడ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement