7 అభ్యంతరాలూ తిరస్కరణ | collector 7 objections rejected on zptc nominations | Sakshi
Sakshi News home page

7 అభ్యంతరాలూ తిరస్కరణ

Mar 23 2014 11:55 PM | Updated on Mar 28 2018 10:59 AM

ప్రాదేశిక స్థానాల నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి వచ్చిన ఏడు అభ్యంతరాలనూ తోసిపుచ్చినట్టు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక స్థానాల నామినేషన్ల తిరస్కరణకు సంబంధించి వచ్చిన ఏడు అభ్యంతరాలనూ తోసిపుచ్చినట్టు  కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి దా ఖలైన అప్పీళ్లను కలెక్టర్ ఆదివారం  అభ్యర్థుల సమక్షంలో విచారించారు. పూడూరు జెడ్పీటీసీకి మేఘమాల దాఖలు చేసిన  నామినేషన్‌ను ప్రతిపాదించిన వ్యక్తి చిరునామా పూడూరుగా కాకుండా పరిగి అని పేర్కొన్నందున నామినేషన్ తిరస్కరించినట్టు కలెక్టర్ తెలిపారు.

 వికారాబాద్  జెడ్పీటీసీకి నామినేషన్ వేసిన చాకలి నర్సింహులు, యాచారం స్థానానికి నామినేషన్ వేసిన గడ్డం శీనులు డిక్లరేషన్‌పై సంతకం చేయనందున, మంచాల సీటుకు నామినేషన్ దాఖలు చేసిన ప్రభాకర్ నామినేషన్ పత్రంపై సంతకం చేయనందున తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఇక తాండూరు జెడ్పీటీసీ స్థానానికి దాఖలైన రెండు నామినేషన్లను ఓటరు జాబితాలో వారి పేర్లు లేనందున తిరస్కరించినట్టు ఆయా అభ్యర్థుల సమక్షంలో జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement