చంద్రబాబువల్లే ముక్కలైన రాష్ట్రం: కిరణ్ | Chandrababu by the fragmented state: Kiran | Sakshi
Sakshi News home page

చంద్రబాబువల్లే ముక్కలైన రాష్ట్రం: కిరణ్

May 3 2014 2:09 AM | Updated on Aug 14 2018 4:21 PM

చంద్రబాబువల్లే  ముక్కలైన రాష్ట్రం: కిరణ్ - Sakshi

చంద్రబాబువల్లే ముక్కలైన రాష్ట్రం: కిరణ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రెండు కళ్ల విధానంవల్లే రాష్ర్టం రెండు ముక్కలైందని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రెండు కళ్ల విధానంవల్లే రాష్ర్టం రెండు ముక్కలైందని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ర్ట విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు చంద్రబాబు బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజ మండ్రి నగరాల్లో శుక్రవారం రోడ్‌షోలు నిర్వహించారు.   చంద్రబాబు లేఖతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ రెండు ముక్కలు చేస్తే, దానికి బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆ బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారని దుయ్యబట్టారు
 
 

Advertisement
 
Advertisement
Advertisement