సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్లాల్ | bhanwar lal warns tdp mp cm ramesh to behave properly | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్లాల్

May 7 2014 12:12 PM | Updated on Aug 14 2018 4:24 PM

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్లాల్ - Sakshi

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్లాల్

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అమర్యాదగా ప్రవర్తించారు. తన నోటి దురుసును ప్రదర్శించారు.

ఓడిపోతున్నామన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో కూడా వారికి తెలియట్లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అమర్యాదగా ప్రవర్తించారు. తన నోటి దురుసును ప్రదర్శించారు. దీంతో భన్వర్లాల్ నొచ్చుకుని, రమేష్ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇలాగే ఉంటారా అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

పక్కగ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు స్టే ఇస్తే మీరేం చేస్తున్నారంటూ భన్వర్‌లాల్‌ను సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అయితే, హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని ఆయనకు భన్వర్‌లాల్‌ చెప్పారు. అంతేకాక, మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదని, పద్దతి మార్చుకోవాలంటూ సీఎం రమేష్‌ను భన్వర్లాల్ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement