కేజ్రీవాల్ ఎవరినైనా కరుస్తారు: మొయిలీ | Arvind Kejriwal can bite anyone on the street, says Veerappa Moily | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ ఎవరినైనా కరుస్తారు: మొయిలీ

Mar 24 2014 12:03 PM | Updated on Sep 2 2017 5:07 AM

కేజ్రీవాల్ ఎవరినైనా కరుస్తారు: మొయిలీ

కేజ్రీవాల్ ఎవరినైనా కరుస్తారు: మొయిలీ

గ్యాస్ ధర పెంపు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలు వాస్తవదూరమైనవి మొయిలీ కొట్టిపారేశారు.

న్యూఢిల్లీ: బీజేపీలో ఇప్పుడు ఏకఛత్రాదిపత్యం నడుస్తోందని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ విమర్శించారు. బీజేపీకి ఒకటే ఎజెండా ఉందని, అది ఆర్ఎస్ఎస్ అజెండా అని అన్నారు. జశ్వంత్ సింగ్ నిరాకరించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ను బీజేపీలో చేర్చుకుని, బయటకు గెంటడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీలో స్థిరత్వం లోపించిందని, ఆ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పొంతన కుదరడం లేదని ఎద్దేవా చేశారు.

గ్యాస్ ధర పెంపు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలు వాస్తవదూరమైనవి మొయిలీ కొట్టిపారేశారు. కేబినెట్ నిర్ణయాన్నే తాము అమలు చేశామని తెలిపారు. వీధిలో ఎవరినైనా కేజ్రీవాల్ కరవగలరంటూ ఘాటుగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement