ఒక్కరికన్నా ఉద్యోగమివ్వాలె | amma mata for nava telangana | Sakshi
Sakshi News home page

ఒక్కరికన్నా ఉద్యోగమివ్వాలె

Apr 13 2014 1:53 AM | Updated on Sep 2 2017 5:56 AM

నా కొడుకు గోదరి రాజేందర్ గవర్నమెంట్ టీచర్. చందుర్తి మండలం బండపల్లిలో పని చే సేటోడు.

అమ్మ మాట..
 
 నా కొడుకు గోదరి రాజేందర్ గవర్నమెంట్ టీచర్. చందుర్తి మండలం బండపల్లిలో పని చే సేటోడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటోడు. 2011 జూలై 31న తెలంగాణ కోసం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు. ప్రభుత్వ కొలువున్నా.. నా కొడుకు తెలంగాణ కోసం చనిపోయిండంటే తెలంగాణ  ఎంత ముఖ్యమో నాకు అప్పుడే ఎరుకైంది. నా కొడుకు సదువుకున్నోడు అయినందునే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయిండు. తెలంగాణ రాదనే బెంగతో చనిపోయిండు. ఇప్పుడు తెలంగాణ అచ్చింది కాబట్టి తెలంగాణ కోసం పాణాలు తీసుకున్నోళ్ల కుటుంబాలను ఆదుకోవాలి. వారి కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇయ్యాలి. వారి తల్లిదండ్రలకు పెన్షన్ ఇయ్యాలి. పేదలకూ జీవించే అవకాశం కల్పించాలి. వారికి తిండి, బట్ట, ఆశ్రయం కల్పించాలి. నాయకులందరూ నిజాయితీగా పనిచేయాలి. గప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతది. అమరవీరులకు కూడా ఆత్మశాంతి కలుగుద్ది.    
  - సేకరణ: లక్ష్మారెడ్డి, తిమ్మాపూర్
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement