బెల్టులో దాచి 3 కిలోల బంగారం తరలింపు | 3 kg of gold hidden in the models move | Sakshi
Sakshi News home page

బెల్టులో దాచి 3 కిలోల బంగారం తరలింపు

May 10 2014 1:38 AM | Updated on Aug 14 2018 4:24 PM

నడుముకు పెట్టుకున్న బెల్టులో గుట్టుగా తరలిస్తున్న 3 కిలోల బంగారాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ వాసిని అదుపులోకి తీసుకున్న చెన్నై రైల్వే పోలీసులు

 చెన్నై: నడుముకు పెట్టుకున్న బెల్టులో గుట్టుగా తరలిస్తున్న 3 కిలోల బంగారాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రైలులో వెళ్లేందుకు శుక్రవారం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సత్యనారాయణ(58) మెటల్ డిటెక్టర్‌ను దాటుతున్న క్రమంలో బంగారం దాచిన విషయం వెలుగులోకి వచ్చింది. క్షుణ్ణంగా పరిశీంచిన పోలీసులు సత్యనారాయణ నడుముకు ధరించిన బెల్టులో బంగారాన్ని దాచి తరలిస్తున్నట్టు గుర్తించారు. పన్నులు చెల్లించకుండా తరలిస్తున్న బంగారం సహా సత్యనారాయణను రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement