క్రీడలు: షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్ | sports news | Sakshi
Sakshi News home page

క్రీడలు: షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్

Apr 30 2014 10:16 PM | Updated on Jul 11 2019 5:01 PM

పోర్షే గ్రాండ్ ప్రి టెన్నిస్ టైటిల్‌ను మరియా షరపోవా గెలుచుకుంది. స్టుట్‌గార్‌‌టలో ఏప్రిల్ 27న జరిగిన ఫైనల్స్‌లో అనా ఇవనోవిక్‌ను షరపోవా ఓడించింది.

 చిత్ర మగిమైరాజ్‌కు ప్రపంచ మహిళల స్నూకర్ టైటిల్
 బెంగళూరుకు చెందిన చిత్రమగిమైరాజ్ ప్రపంచ మహిళల స్నూకర్ చాంపియన్ టైటిల్ గెలుచుకుంది. లీడ్స్ (ఇంగ్లండ్)లో ఏప్రిల్ 22న జరిగిన ఫైనల్‌లో బెలారస్‌కు చెందిన అలెనా అస్మోలోవను చిత్ర ఓడించి విజేతగా నిలిచింది.
 
 లిన్ డాన్, సుంగ్ జీలకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టైటిల్స్
 దక్షిణ కొరియాలో ఏప్రిల్ 27న ముగిసిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్‌డాన్, మహిళల సింగిల్స్ టైటిల్‌ను సుంగ్ జీ యున్ గెలుచుకున్నారు.
 విజేతలు
 పురుషుల సింగిల్స్: లిన్ డాన్ (చైనా) ఫైనల్స్‌లో ససాకి షో (జపాన్)ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.
 మహిళల సింగిల్స్: సుంగ్ జీ యున్ (కొరియా) గెలుచుకుంది. ఈమె ఫైనల్స్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది.
 పురుషుల డబుల్స్: షిన్ బీక్ చోయెల్ - యు యోన్ సియోంగ్ (కొరియా) గెలుచుకున్నారు. వీరు లియు, యుచెన్ (చైనా)లను ఓడించారు.
మహిళల డబుల్స్: లూ యింగ్ - లు యు (చైనా) గెలుచుకున్నారు. వీరు కిమ్ హ నా-జుంగ్ యుంగ్ యున్ (కొరియా)లను ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్: లీ చున్ హె - చావు హో వా (హాంకాంగ్) గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో షిన్ బీక్ చోయెల్ - జాంగ్ యె నా (కొరియా)లను ఓడించారు. ఈ చాంపియన్‌షిప్ లో భారత్‌కు చెందిన సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి.
 
 లాహిరికి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్
 భారత్‌కు చెందిన అనిర్బన్ లాహిరి గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జకర్తాలో ఏప్రిల్ 27న ముగిసిన పోటీలో లాహిరి  టైటిల్ సాధించగా కొరియాకు చెందిన బేక్ సెయుహైన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ టైటిల్ లాహిరి గెలుచుకోవడం ఇది నాలుగోసారి.
 
 ఎమ్మా బొన్నీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్స్ టైటిల్
 ఎమ్మాబొన్నీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. లీడ్స్‌లో ఏప్రిల్ 24న జరిగిన ఫైనల్‌లో భారత్‌కు చెందిన ఉమాదేవి నాగరాజ్‌ను బోన్నీ ఓడించింది. ఈ టైటిల్‌ను భారత్ నుంచి తొలిసారి 2005లో అనూజ ఠాకూర్ గెలుచుకుంది. తర్వాత 2006, 2007లో చిత్ర గెలుచుకుంది.
 
 షరపోవాకు పోర్షే గ్రాండ్ ప్రి టైటిల్
 పోర్షే గ్రాండ్ ప్రి టెన్నిస్ టైటిల్‌ను మరియా షరపోవా గెలుచుకుంది. స్టుట్‌గార్‌‌టలో ఏప్రిల్ 27న జరిగిన ఫైనల్స్‌లో అనా ఇవనోవిక్‌ను షరపోవా ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement