మినహాయింపు పొందేదెలా!

officials delay on Annual examination fee exemption - Sakshi

పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు విషయంలో అధికారుల అలసత్వం

సాక్షి, మహబూబాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహా యింపు ఈ ఏడాది పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా అందకుండా పోతోంది. దీంతో  మూడు లక్షల మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం నెలకొంది. రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈనెల 8 పరీక్ష ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఆధారంగా ఫీజు చెల్లిం పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మినహా యింపు ఇచ్చింది. గ్రామాల్లో ఏడాదికి తల్లి దండ్రుల ఆదాయం రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలకు మించకుండా ఉండాలి. సంబంధిత మండల రెవెన్యూ అధికారి నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు ఇవ్వాలి. ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి ఆదాయ పరిమితిని గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాం తాల్లో రూ.2 లక్షలకు పెంచింది. అధికారులు ఎవరికీ రూ.20 వేల వార్షిక ఆదాయం వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు ఫలితం దక్కకుండా పోనుంది. 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top