1982లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎం)ను నెలకొల్పింది.
టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్వర్క్
ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌పై నాకు ఆసక్తి. ఈ సబ్జెక్టులో పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?
- అరుణ్, విశాఖపట్నం.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వివరిస్తుంది. ఈ సబ్జెక్టు పీజీ కోర్సు కరిక్యులంలో కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ ప్రణాళిక, మోడలింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి.
కోర్సుల వివరాలు:
ఆంధ్రా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఎంఈను అందిస్తోంది.
అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్సైట్: www.andhrauniversity.edu.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తుంది.
అర్హత: బీఈ/ బీటెక్/ సివిల్ ఇంజనీరింగ్‌లో ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్సైట్: www.svuniversity.in
కెరీర్: ఎన్విరాన్‌మెంటల్‌లో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తిచేసినవారు పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను పొందొచ్చు. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ, సంస్థలు, ప్రైవేటు సంస్థల సీఎస్ఆర్ విభాగాల్లోనూ అవకాశాలుంటాయి.
ఎంబీబీఎస్ కాకుండా ఎయిమ్స్ అందిస్తున్న ఇతర కోర్సుల వివరాలు తెలపగలరు?
- సౌజన్య, షాపూర్‌నగర్.
బ్యాచిలర్ స్థాయిలో నర్సింగ్, మెడికల్ టెక్నాలజీ, ఆఫ్తాల్మిక్ టెక్నిక్‌లలో బీఎస్సీ కోర్సులను అందిస్తోంది. అర్హత: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2ను కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేసుండాలి. ఎంట్రన్స్‌లో ప్రతిభ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్సైట్: www.aiims.edu
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న ‘రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్’ వివరాలు తెలియజేయగలరు?
- శైలజ, మెదక్
ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్.. ప్యూర్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ స్టూడెంట్షిప్ను అందిస్తోంది. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారు స్టూడెంట్షిప్నకు అర్హులు.
వెబ్సైట్: www.cam.ac.uk
జెనెటిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను ఆఫర్ చేస్తున్న విద్యా సంస్థల వివరాలు తెలియజేయండి?
- రాజు, కరీంనగర్
చాలా ఎక్కువ పరిధి ఉన్న బయోటెక్నాలజీలో జెనెటిక్ ఇంజనీరింగ్ ఒక స్పెషలైజేషన్. దీని అప్లికేషన్స్ మెడిసిన్, డ్రగ్ డెవలప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో అవసరమవుతాయి.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తమిళనాడు.. జెనెటిక్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో ఇంటర్ ఉత్తీర్ణత. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్సైట్: www.srmuniv.ac.in
బీటెక్- బయోటెక్నాలజీ కోర్సులో చేరినా జెనెటిక్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరిజ్ఞానం పొందొచ్చు.
సీబీఐటీ, హైదరాబాద్.. బయోటెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్. అర్హత పరీక్ష, ఎంసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్సైట్: www.cbit.ac.in
కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. బయోటెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది.
వెబ్సైట్: www.andhrauniversity.edu.in
బయోటెక్నాలజీని అందిస్తున్న ఐఐటీలు:
ఐఐటీ గౌహతి. www.iitg.ac.in
ఐఐటీ రూర్కీ. www.iitr.ac.in
ఐఐటీ ఖరగ్‌పూర్. www.iitkgp.ac.in
ఐఐఎఫ్ఎం-భోపాల్ ఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి?
- చంద్ర, వరంగల్.
1982లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (ఐఐఎఫ్ఎం)ను నెలకొల్పింది. ఇది ఎన్విరాన్మెం ట్ అండ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా నుంచి డాక్టోరల్ స్థాయి వరకు వివిధ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
కోర్సులు:
కన్జర్వేషన్ అండ్ లైవ్లీహుడ్; ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ ప్రధాన సబ్జెక్టులుగా పీజీ డిప్లొమా ఇన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ను ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్లో ఎంఫిల్‌ను అందిస్తోంది. అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా డిప్లొమా. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
మేనేజ్మెంట్లో ఫెలో ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా ప్రొఫెషనల్ అర్హత ఉన్నవారు కోర్సుకు అర్హులు. ఎంట్రన్స్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
కెరీర్: కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ విభాగాలు; బ్యాంకులు; స్వచ్ఛంద సంస్థలు; ఆర్థిక సంస్థలు; స్టాక్ ఎక్స్ఛేంజ్లు; పరిశోధన, విద్యా సంస్థల్లో అవకాశాలుంటాయి.
వెబ్సైట్: www.iifm.ac.in