పాలిమర్ సైన్స్‌లో బీటెక్ కోర్సు..


 టి. మురళీధరన్

 టి.ఎం.ఐ. నెట్‌వర్క్




 

 విజువల్ కమ్యూనికేషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తున్న సంస్థలేవి?

 - అనుపమ, నల్గొండ


 దృశ్య సాధనాల సహాయంతో జరిపే కమ్యూనికేషన్‌ను వివరించేదే విజువల్ కమ్యూనికేషన్. దీనికి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కరిక్యులంలో ఇన్ఫర్మేషన్ డిజైన్, టైపోగ్రఫీ, పబ్లికేషన్ అండ్ బుక్ డిజైన్, కార్పొరేట్ ఐడెంటిటీ అండ్ బ్రాండింగ్, మాస్ కమ్యూనికేషన్ థియరీ, ఇలుస్ట్రేషన్స్ అండ్ ఎగ్జిబిషన్ డిజైన్.

 

 కోర్సులు అందిస్తున్న సంస్థలు:

 జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్, హైదరాబాద్.. బీఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్) కోర్సును అందిస్తోంది. ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ డిజైనింగ్‌పై దృష్టిసారిస్తుంది.

 వెబ్‌సైట్: www.zica.org

 ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, తమిళనాడు.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సు అందిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో +2 పూర్తిచేయాలి. అర్హత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.srmuniv.ac.in

 లయోలా కాలేజీ, చెన్నై.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 60 శాతం మార్కులతో +2 పూర్తిచేయాలి. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.loyolacollege.edu

 అన్నామలై యూనివర్సిటీ, అన్నామలై నగర్.. దూరవిద్యలో బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: +2.

 వెబ్‌సైట్: www.annamalaiuniversity.ac.in

 సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, చెన్నై.. బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: +2.

 వెబ్‌సైట్: www.stpetersuniversity.org

 కెరీర్: విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సు పూర్తిచేసిన వారు మీడియా సంస్థలు, అడ్వర్టైజింగ్ కంపెనీలు, ప్రచురణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల వంటి వాటిలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

 

 

 

 

 

 

 పాలిమర్ సైన్స్‌లో బీటెక్ కోర్సు వివరాలు తెలియజేయగలరు?

 - వేణు, హైదరాబాద్


పాలిమర్ సైన్స్.. పాలిమర్ల ఉత్పత్తి, వినియోగానికి సంబంధించిన అంశాలను వివరిస్తుంది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో దీని అనువర్తనాలు చాలా రంగాల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, టెక్స్‌టైల్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉపయోగపడుతున్నాయి. పాలిమర్ సైన్స్‌తో కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది.

 కోర్సులు:

 ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ.. పాలిమర్ సైన్స్, కెమికల్ టెక్నాలజీలో బీటెక్‌ను అందిస్తోంది. ఈ కోర్సు కరిక్యులంలో కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మ్యాథమెటిక్స్, పాలిమర్ కెమిస్ట్రీ, రబ్బర్ టెక్నాలజీ, పాలిమర్స్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ వంటి అంశాలు ఉంటాయి.    

 వెబ్‌సైట్: www.du.ac.in

 కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కొచ్చిన్.. బీటెక్ (పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్)ను ఆఫర్ చేస్తోంది. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.    వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఛిఠట్చ్ట.్చఛి.జీ

 యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, కోల్‌కత.. పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది.

 వెబ్‌సైట్: www.caluniv.ac.in

 

 

 ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయగలరు?

 - వెంకట్, గుంటూరు.


 ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ.. ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి ప్రక్రియలను వివరిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఔషధాల తయారీ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్, బయో టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.

 కోర్సులు:

 జి.పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీ కోర్సు  ను ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.gprcp.ac.in

 కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని అందిస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in

 విట్ యూనివర్సిటీ, వెల్లూరు.. ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది.

 వెబ్‌సైట్: www.vit.ac.in

 బిట్స్ పిలానీ, హైదరాబాద్.. ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌తో ఎం.ఫార్మసీని ఆఫర్ చేస్తోంది. అర్హత: బి.ఫార్మసీ. ఎంట్రెన్స్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

 వెబ్‌సైట్: www.bitspilani.ac.in/hyderabad

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top