వితంతువుపై ఆటో డ్రైవర్‌ అత్యాచారయత్నం | auto driver rape attempt on widow | Sakshi
Sakshi News home page

వితంతువుపై ఆటో డ్రైవర్‌ అత్యాచారయత్నం

Sep 12 2016 8:33 PM | Updated on Jul 28 2018 8:51 PM

వితంతువుపై ఆటో డ్రైవర్‌ అత్యాచారయత్నం - Sakshi

వితంతువుపై ఆటో డ్రైవర్‌ అత్యాచారయత్నం

వితంతువుపై ఓ ఆటో డ్రైవర్‌ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని కంచనపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది.

రఘునాథపల్లి : వితంతువుపై ఓ ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని కంచనపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై రంజిత్‌రావు కథనం ప్రకారం .. మండలంలోని కంచనపల్లికి చెందిన ఓ వితంతువు తన పిల్లలు హాస్టల్‌లో చదువుతుండగా వారిని చూసేందుకు వెళ్లి తిరిగి రఘునాథపల్లికి చేరుకుంది.

స్వగ్రామానికి వెళ్లేందుకు కంచనపల్లి రోడ్డుపై వాహనాల కోసం ఎదురు చూస్తుండగా అదే గ్రామానికి చెందిన మేడ అనిల్‌ తాను గ్రామానికే వెళుతున్నానని చెప్పి తన ఆటోలో మహిళను ఎక్కించుకున్నాడు. పిట్టలగూడెం సమీపంలోకి వెళ్లగానే అనిల్‌్‌ ఆటోలో ఉన్న మహిళను కిందకు లాగి చెట్ల పొదల్లో లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాధిత మహిళ ప్రతిఘటించడంతో తప్పయిందని చెప్పి మహిళను ఆటోలో ఎక్కించుకొని గ్రామం వైపు బయల్దేరాడు. కానీ  కంచనపల్లిలో ఆటో నిలపకుండా అతి వేగంగా గబ్బెట రహదారి వైపు తీసుకెళ్తుండడంతో బాధిత మహిళ ఆపాలని బతిమిలాడింది. అయిన అతడు వినకపోవడంతో కిందికి దూకడంతో కుడిచేతికి గాయమైంది. గాయంతోనే గ్రామ పెద్దలకు విషయం చెప్పి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో అనిల్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement