చినజీయర్‌ స్వామిని కలిసిన వైటీడీఏ అధికారులు | ytda officers to meet the chinajeyar swami | Sakshi
Sakshi News home page

చినజీయర్‌ స్వామిని కలిసిన వైటీడీఏ అధికారులు

Aug 9 2016 9:23 PM | Updated on Sep 4 2017 8:34 AM

చినజీయర్‌ స్వామిని కలిసిన వైటీడీఏ అధికారులు

చినజీయర్‌ స్వామిని కలిసిన వైటీడీఏ అధికారులు

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం విస్తరణపై వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామిని మంగళవారం విజయవాడలోని ఆయన నివాసంలో కలిశారు.

యాదగిరికొండ :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం విస్తరణపై వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామిని మంగళవారం విజయవాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పనుల గురించి చినజీయర్‌ స్వామి ఈఓను అడిగి తెలుసుకున్నారు. ఆలయ విస్తరణ పనుల విషయంలో స్వామీజీ కొన్ని సూచనలు చేశారు. అధికారులు అక్కడి నుంచి గుంటూరు జిల్లా గురిజాపల్లికి వెళ్లి ఆలయ  విస్తరణకు కావాల్సిన రాయిని పరిశీలించారు. జీయర్‌స్వామిని కలిసిన వారిలో ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, బడే రవి,  స్థపతి సుందర్‌రాజన్, దేవస్థాన అధికారి దోర్భల భాస్కరశర్మ, అర్చకులు సురేంద్రాచారి ఉన్నారు.
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement