‘వెన్నపూస’ను గెలిపించండి | ysrcp canvas in mlc elections | Sakshi
Sakshi News home page

‘వెన్నపూస’ను గెలిపించండి

Feb 18 2017 12:57 AM | Updated on Aug 29 2018 6:26 PM

‘వెన్నపూస’ను గెలిపించండి - Sakshi

‘వెన్నపూస’ను గెలిపించండి

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్ధతుతో పోటీ చేస్తున్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డికు తొలిప్రాధాన్యత ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్‌ పిలుపునిచ్చారు.

అనంతపురం ఎడ్యుకేషన్ : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్ధతుతో పోటీ చేస్తున్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డికు తొలిప్రాధాన్యత ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీం అహ్మద్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో ఉన్న ఈద్గా మసీదు సమీపంలో నిర్వహించిన ప్రచారంలో నదీంఅహ్మద్‌తో పాటు వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నదీంఅహ్మద్‌ మాట్లాడుతూ వెన్నపూస గోపాల్‌రెడ్డి గెలిపించడం ద్వారా  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. ముఖ్యంగా నిరుద్యోగులను  ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మించి ఓట్లు  దండుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం లేదంటే ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేâýæ్లవుతున్నా పట్టించుకోలేదన్నారు. దీనికితోడు రాష్ట్ర విభజనతో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవినిలాంటిదన్నారు.

ప్రత్యేకహోదా కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించాలనే లక్ష్యంగా తమ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని  పోరాటం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్ధతు పలకాలని విజ్ఞప్తి చేశారు.   

గోపాల్‌రెడ్డికి మద్దతుగా నేడు ప్రచారం  
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతు అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి ఐటీ విభాగం ప్రతినిధులు శనివారం రానున్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షించే పట్టభద్రులైన యువత, నిరుద్యోగుల చైతన్యమే లక్ష్యంగా గోపాల్‌రెడ్డికి ప్రచారం చేయడానికే తాము వస్తున్నట్లు ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు ఉదయం 10.30 గంటలకు ప్రెస్‌క్లబ్‌కు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement