
మూడు కుటుంబాలకు షర్మిల పరామర్శ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టారు.
వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గంలో ఈ యాత్ర ప్రారంభమైంది.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తున్నారు. గండ్లకుంటలో ఎడెల్లి వెంకటయ్య కుటుంబాన్ని, రేగులలో కొత్తగట్టు శాంతమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. వారికి అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి బయల్దేరి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. వరంగల్ జిల్లాలో షర్మిల 5 రోజుల పాటు 31 కుటుంబాలను పరామర్శిస్తారు.