కాలువలో పడి యువకుడి మృతి | youngster died in kenal | Sakshi
Sakshi News home page

కాలువలో పడి యువకుడి మృతి

Feb 19 2017 11:15 PM | Updated on Sep 28 2018 3:41 PM

కాలువలో పడి యువకుడి మృతి - Sakshi

కాలువలో పడి యువకుడి మృతి

నకరికల్లు : ప్రమాదవశాత్తూ కాలువలో జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని శ్రీరాంపురం సమీపంలో గల బెల్లంకొండ బ్రాంచ్‌ కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

 
 
నకరికల్లు : ప్రమాదవశాత్తూ కాలువలో జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని శ్రీరాంపురం సమీపంలో గల బెల్లంకొండ బ్రాంచ్‌ కెనాల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. నకరికల్లుకు చెందిన వీర వెంకటేష్‌ (19) తన మిత్రులతో కలసి బెల్లంకొండ బ్రాంచ్‌ కెనాల్‌ లోపలికి వెళ్ళాడు. గట్టుపై నిలబడి మిత్రులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి కాలువలో పడిపోయాడు. సమాచారం అందుకున్న బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరారు. ఎన్‌ఎస్‌పీ అధికారులను సంప్రదించి కాలువలో నీటిని నిలుపుదల చేశారు. అప్పటికే యువకుడు మృతిచెందినట్లు గుర్తించాడు. మృత దేహాన్ని వెలికితీశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement