నగర శివారులోని వీకర్‌సెక‌్షన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు బోయ గిడ్డయ్య అదృశ్యమయ్యాడు.
యువకుడు అదృశ్యం
Jan 5 2017 11:56 PM | Updated on Sep 5 2017 12:30 AM
కర్నూలు: నగర శివారులోని వీకర్‌సెక‌్షన్ కాలనీకి చెందిన ఆంజనేయులు కుమారుడు బోయ గిడ్డయ్య అదృశ్యమయ్యాడు. ఎల్.పేట గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంతో సహా 30ఏళ్లుగా వీకర్‌సెక‌్షన్ కాలనీలో ఉంటూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న కుమారుడు ఆంజనేయులు కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన మేనత్త కూతురును 2010లో పెళ్లి చేసుకున్నాడు. భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె గత నెలలో పుట్టింటికి వెళ్లింది. ఇందుకు మనస్థాపానికి గురైన ఆంజనేయులు డిసెంబరు 31వ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి తండ్రికి ఫోన్ చేసి వెంకటగిరిలో ఉన్నానని, ఇవే చివరి మాటలంటూ చెప్పి ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. తండ్రి అతని కోసం బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తండ్రి గురువారం నాల్గవ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్(94406 27736, 08518 – 259462) ద్వారా సమాచారం అందించాలని సీఐ నాగరాజు రావు కోరారు.
Advertisement
Advertisement