కల్లుకు బానిసైన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మంగళవారం కల్లూరు అర్బన్‌లోని శరీన్‌నగర్‌లో నివాసం ఉంటున్న సత్యబాబు, వెంకటలక్ష్మీ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎం. విశ్వనాథం డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు.
కల్లు తాగి యువకుడు మృతి
Dec 13 2016 9:49 PM | Updated on Sep 4 2017 10:38 PM
- నేత్ర దానానికి కుటుంబ సభ్యులు అంగీకారం
కల్లూరు: కల్లుకు బానిసైన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మంగళవారం కల్లూరు అర్బన్‌లోని శరీన్‌నగర్‌లో నివాసం ఉంటున్న సత్యబాబు, వెంకటలక్ష్మీ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ఎం. విశ్వనాథం డిగ్రీ వరకు చదివి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మంగళవారం శరీన్‌నగర్‌లోని కల్లు పెంట వద్దే మత్తులో పడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విశ్వనాథం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కళ్లను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు నేత్రాలను సేకరించారు.
Advertisement
Advertisement