గుండెపోటుతో యువకుడి మృతి
తిరుమలకు కాలిబాటలో వెళుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిన ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు.
తిరుమల కాలిబాటలో ఘటన
సాక్షి, తిరుమల :
తిరుమలకు కాలిబాటలో వెళుతూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిన ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. వేములపల్లి రఘువీర్ (30) మహారాష్ట్ర లోని కాన్పూర్‌లో ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. పీహెచ్‌డీ ఉతీర్ణత సాధించటంతో మొక్కు తీర్చుకునేందుకు బుధవారం ఉదయం మరో ఇద్దరు స్నేహితులతో కలసి అలిపిరి కాలిబాటలో తిరుమలకు బయలుదేరాడు. మార్గంలో హఠాత్తుగా ఛాతీనొప్పి వచ్చింది. దీంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని టీటీడీ అంబులెన్స్ ద్వారా సొంత గ్రామానికి తరలించారు.