పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలంలో ఉన్న గోదావరి నదిలోకి దూకిన యువకుడు గల్లంతయ్యాడు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలంలో ఉన్న గోదావరి నదిలోకి దూకిన యువకుడు గల్లంతయ్యాడు. కొవ్వూరు రూరల్ మండలం చిడిపి గ్రామానికి చెందిన పామెళ్ల సురేంద్ర(29) అనే యువకుడు కుటుంబకలహాల కారణంగా జీవితంపై విరక్తిచెంది మంగళవారం మధ్యాహ్నం గోదావరి నదిలో దూకాడు. గట్టుపై ద్విచక్రవాహనం ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని ఆచూకి ఇంతవరకూ తెలియలేదు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.