సెల్ఫీ తీసుకుంటూ అనంత లోకాలకు | young man death in chelimela water fall wile take a selfie | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తీసుకుంటూ అనంత లోకాలకు

Aug 30 2017 10:43 AM | Updated on Sep 17 2017 6:09 PM

మృతి చెందిన చిట్టిబాబు

మృతి చెందిన చిట్టిబాబు

చెలిమిచేను జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ యువకుడు లోయలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

చెలిమిచేను జలపాతంలో పడి యువకుడి మృతి
రామకుప్పం: చెలిమిచేను జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ యువకుడు లోయలో పడి మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కంగుంది పంచాయతీ రాములగుట్టుచేను గ్రామానికి చెందిన చిట్టిబాబు(27) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా వీర్నమల పంచాయతీలోని చెలిమిచేను జలపాతం వద్దకు వెళ్లారు.

అక్కడ చిట్టిబాబు జలపాతం పైభాగం నుంచి కిందకు దిగుతూ ఎక్కువగా నీరు ప్రవహిస్తున్న చోటికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి లోయలో పడిపోయాడు. స్నేహితులు గొర్రెల కాపరుల సహాయంతో లోయలోకి దిగి తీవ్రంగా గాయపడిన చిట్టిబాబును అతికష్టం మీద పైకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement