అధినేతను కలిసిన వైసీపీ నేతలు | YCP members met their cheif | Sakshi
Sakshi News home page

అధినేతను కలిసిన వైసీపీ నేతలు

Mar 15 2014 3:59 AM | Updated on May 25 2018 9:12 PM

అధినేతను కలిసిన వైసీపీ నేతలు - Sakshi

అధినేతను కలిసిన వైసీపీ నేతలు

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : నరసాపురంలో జరిగే ఎన్నికల జనభేరి సభలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం నుంచి మార్గమధ్యంలో పార్టీ సీఈసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇంటి వద్ద కొద్దిసేపు ఆగారు.

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : నరసాపురంలో జరిగే ఎన్నికల జనభేరి సభలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం నుంచి మార్గమధ్యంలో పార్టీ సీఈసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇంటి వద్ద కొద్దిసేపు ఆగారు. రంగరాజుతో, పార్టీ నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తెల్లం బాల రాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్‌తో పాటు మిగిలిన నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, పార్టీ నాయకులు మారం వెంకటేశ్వరరావు తదితరులు జగన్‌ను కలిశారు.  
 
 రోడ్‌షోను విజయవంతం చేయాలి
 చాగల్లు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16న కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న రోడ్ షోను విజయవంతం చేయాలని నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత కార్యకర్తలు, అభిమానులను కోరారు. 16వ తేదీ ఉదయం 9 గంటలకు బ్రాహ్మణగూడెంలో రోడ్‌షో మొదలవుతుందని, బ్రాహ్మణగూడెం, ఎస్.ముప్పవరం, ఊనగట్ల, చాగల్లు, మీనానగరం, ఐ.పంగిడి మీదుగా కొవ్వూరు చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement