వైఎస్ఆర్కి పేరొస్తుందనే... | y visweswara reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్కి పేరొస్తుందనే...

Aug 18 2016 3:32 PM | Updated on May 29 2018 2:33 PM

వైఎస్ఆర్కి పేరొస్తుందనే... - Sakshi

వైఎస్ఆర్కి పేరొస్తుందనే...

వైఎస్ఆర్ కి పేరొస్తుందనే..చంద్రబాబు హంద్రీనీవా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.

అనంతపురం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే.. చంద్రబాబు హంద్రీనీవా పట్టించుకోలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అనంతపురానికి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని ఆయన గుర్తు చేశారు. గురువారం అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్లో ఆయన పుష్కర స్నానం చేశారు.

అనంతరం వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... ప్రతి ఏటా 15 టీఎంసీలు వస్తున్న ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు నీరు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని వై.విశ్వేశ్వరరెడ్డి పూజలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement