మహిళ బలవన్మరణం | women suicide | Sakshi
Sakshi News home page

మహిళ బలవన్మరణం

Sep 6 2016 11:33 PM | Updated on Nov 6 2018 8:04 PM

రామన్నపేట : అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలకేంద్రంలో చోటు చేసుకుంది.

రామన్నపేట : అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం రాత్రి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..శోభనాద్రిపురం గ్రామానికి చెందిన బొడిగె అండాలు(55) తన భర్త ఆంజనేయులుతో కలిసి రేండేళ్లుగా రామన్నపేటలో నివాసం ఉంటుంది.  ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.  మానసికంగా బాగా కుంగిపోయింది. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది.  తీవగ్రాయాలపాలయిన అండాలు ఇంట్లోనే మృతి చెందింది.  భర్త ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎస్‌ఐ పైడినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement