ఇల్లాలిని బలిగొన్న అత్తింటి వేధింపులు | women suicide | Sakshi
Sakshi News home page

ఇల్లాలిని బలిగొన్న అత్తింటి వేధింపులు

Jul 24 2016 6:39 PM | Updated on Sep 4 2017 6:04 AM

ఇల్లాలిని బలిగొన్న అత్తింటి వేధింపులు

ఇల్లాలిని బలిగొన్న అత్తింటి వేధింపులు

అత్త, భర్త వేధింపులు భరించలేక కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని రామన్నగూడెం తండాలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, ఎస్సై షాదుల్లా బాబా కథనం ప్రకారం... రామన్నగూడెం తండాకు చెందిన గుగులోత్‌ బాలుకు నర్సంపేట మండలం జంగాలపల్లితండాకు చెందిన బానోత్‌ లచ్చు కుమార్తె విజయ(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు.

రేగొండ : అత్త, భర్త వేధింపులు భరించలేక కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని రామన్నగూడెం తండాలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, ఎస్సై షాదుల్లా బాబా కథనం ప్రకారం... రామన్నగూడెం తండాకు చెందిన గుగులోత్‌ బాలుకు నర్సంపేట మండలం జంగాలపల్లితండాకు చెందిన బానోత్‌ లచ్చు కుమార్తె విజయ(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వారి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు.
 
దీంతో అత్త భీమిని, భర్త బాలు విజయను నిత్యం వేధిస్తుండేవారు. గత వారం రోజుల క్రితం కూడా వారిద్దరు వ్యవసాయ కూలీ పనికి వెళ్లొచ్చిన విజయను దుర్భాషలాడడంతో భరించలేని విజయ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకొని నిప్పంటిచుకుంది. గమనించిన గ్రామస్తులు మంటలార్పి హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతు ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై షాదుల్లాబాబా తెలిపారు. విజయ తండ్రి లచ్చు నాయక్‌ ఫిర్యాదు మేరకు విజయ భర్త బాలు, అత్త భీమినిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement