సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు | women protest at vijayawada municipal corporation | Sakshi
Sakshi News home page

సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు

May 14 2016 5:11 PM | Updated on Aug 11 2018 4:24 PM

సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు - Sakshi

సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు

విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది.

విజయవాడ: విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అధికారముందని టీడీపీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఏంచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనే ధీమాతో అరాచకాలకు పాల్పడుతున్నారని మహిళలు విమర్శించారు. ప్రజల సొమ్ముతో టీడీపీ కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మద్యంమత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చర్యను సమర్థిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టారు. మహిళలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement