పిల్లలు పుట్టడం లేదని.. | women murdered in rangareddy district | Sakshi
Sakshi News home page

పిల్లలు పుట్టడం లేదని..

Jul 1 2016 9:45 AM | Updated on Mar 28 2018 11:26 AM

పిల్లలు పుట్టడంలేదనే కోపంలో భార్యను హత్యచేశాడో వ్యక్తి.

నవాపేట్: పిల్లలు పుట్టడంలేదనే కోపంలో భార్యను హత్యచేశాడో వ్యక్తి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నవాపేట్ మండలం జంగ్యాడ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాదయ్య(30), ఉమ(25)లకు రేండేళ్ల క్రితం వివాహం అయింది. పిల్లలు పుట్టకపోవడంతో.. భార్య భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదయ్య , ఉమను తీవ్రంగా కొట్టి గొంతు నులిమాడు.

దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం యాదయ్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement