మహిళ అనుమానాస్పద మృతి | woman suspicoius death | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతి

May 10 2017 10:07 PM | Updated on Sep 5 2017 10:51 AM

నార్పల మండలం దుగుమర్రిలో బెస్త రామలింగ భార్య నారాయణమ్మ(42) అనుమానాస్పదస్థితిలో బుధవారం మరణించినట్లు ఎస్‌ఐ రాంప్రసాద్‌ తెలిపారు.

నార్పల (శింగనమల) : నార్పల మండలం దుగుమర్రిలో బెస్త రామలింగ భార్య నారాయణమ్మ(42) అనుమానాస్పదస్థితిలో బుధవారం మరణించినట్లు ఎస్‌ఐ రాంప్రసాద్‌ తెలిపారు. ఆమె తలకు బలమైన గాయమై మరణించడంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారన్నారు. అయితే ఘటనపై గ్రామంలో ఆరా తీశామని చెప్పారు. ప్రమాదవశాత్తు జారిపడటంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement