వ్యాన్ ఢీకొని మహిళ మృతి | woman killed in road accident in srikakulam district | Sakshi
Sakshi News home page

వ్యాన్ ఢీకొని మహిళ మృతి

Aug 13 2016 11:16 AM | Updated on Sep 29 2018 5:26 PM

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ శివారులోని జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బొంతుపేట గ్రామ శివారులోని జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మహిళ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన వ్యాన్... ఆమెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. వ్యాన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement