జిల్లాకు చెందిన ఓ యువతి బెంగుళూరులో అనుమానాస్పదంగా మృతి చెందింది.
వివాహిత అనుమానాస్పద మృతి
Nov 21 2016 7:02 AM | Updated on Nov 6 2018 8:50 PM
వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన యువతి బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జిల్లాలోని చాపాడు మండలం బద్రిపల్లికి చెందిన యోగేశ్వరికి(22) రెండేళ్ల క్రితం మహేశ్వర్‌రెడ్డితో వివాహమైంది. భర్త బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండటంతో.. అక్కడే నివాసముంటున్నారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి యోగేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని అదనపు కట్నం కోసం భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement