విద్యుదాఘాతంతో మహిళ మృతి | woman dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Sep 5 2017 9:38 PM | Updated on Sep 12 2017 1:57 AM

ఉతికిన దుస్తులను ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది.

ధర్మవరం: ఉతికిన దుస్తులను ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన యంకమ్మ (40) మంగళవారం ఉదయం ఇంటి ముందు ఉతికిన దుస్తులను విద్యుత్‌ స్తంభానికి కట్టిన తాడుపై ఆరేయబోయింది. వర్షానికి తడిసిన తాడుకు విద్యుత్‌ ప్రసరిస్తుండటంతో అది తెలీని యంకమ్మ విద్యుదాఘాతానికి గురైంది. హుటాహుటిన ఆమెను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త రామయ్య, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నట్లు వారు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement