విద్యుదాఘాతానికి వివాహిత బలి | woman dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి వివాహిత బలి

Jun 21 2017 10:52 PM | Updated on Sep 5 2017 2:08 PM

మండలలోని ధర్మపురిలో చంద్రశేఖర్‌రాజు భార్య లావణ్య(30) అనే వివాహిత విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ధర్మవరం రూరల్‌ : మండలలోని ధర్మపురిలో చంద్రశేఖర్‌రాజు భార్య లావణ్య(30) అనే వివాహిత విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయమే బాత్‌రూంలో లైటు వేయడానికి వెళ్లగా ఒక్కసారిగా విద్యుత్‌ ప్రసారమై షాక్‌ కొట్టడంతో కిందపడిపోయినట్లు వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి జీవన్, రేవతి, రావణ్‌ అనే పిల్లలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement