అశ్రునయనాలతో అంత్యక్రియలు | with the anchors | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో అంత్యక్రియలు

May 8 2017 11:23 PM | Updated on Aug 8 2018 5:51 PM

అశ్రునయనాలతో అంత్యక్రియలు - Sakshi

అశ్రునయనాలతో అంత్యక్రియలు

అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (70) అంత్యక్రియలు అభిమానులు, బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అనంతపురంలోని ఇంటి నుంచి బీఎన్‌ఆర్‌ భౌతికాయాన్ని మధ్యాహ్నం 1.40 గంటలకు స్వగ్రామమైన కణేకల్లు మండలం పెనకలపాడులోని ఇంటికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. గ్రామస్తులు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చి.. నివాళులర్పించారు.

 కణేకల్లు (రాయదుర్గం) :   అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (70) అంత్యక్రియలు అభిమానులు, బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య జరిగాయి. అనంతపురంలోని ఇంటి నుంచి బీఎన్‌ఆర్‌ భౌతికాయాన్ని మధ్యాహ్నం 1.40 గంటలకు స్వగ్రామమైన కణేకల్లు మండలం పెనకలపాడులోని ఇంటికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ప్రజల సందర్శనార్థం  ఉంచారు. గ్రామస్తులు, అభిమానులు భారీసంఖ్యలో తరలివచ్చి.. నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణీ కాపు భారతిలు బీఎన్‌ఆర్‌ భౌతికాయానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఇంటి నుంచి గ్రామశివారులో ఉన్న పొలం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సాయంత్రం 4.30 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బీఎన్‌ఆర్‌ సోదరులు బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డితో పాటు కుటుంబసభ్యులు మట్టిని ముట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తోపుదుర్తి కవిత, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మీసాల రంగన్న, డిప్యూటీ మేయర్‌ శ్రీరాములు, కణేకల్లు మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, బొమ్మనహాళ్‌ మాజీ ఎంపీపీ లాలుసాబ్, జెడ్పీటీసీ  మాజీ  సభ్యుడు పాటిల్‌ నాగిరెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షులు మారెంపల్లి మారెన్న, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆలూరు చిక్కణ్ణ, నాయకులు విక్రంసింహారెడ్డి, బి.మోహన్‌రెడ్డి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement