పేదల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ | with poor people development Golden telangana Possible | Sakshi
Sakshi News home page

పేదల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ

Aug 25 2016 7:30 PM | Updated on Sep 4 2017 10:52 AM

మాట్లాడుతున్న యాతాకుల భాస్కర్‌

మాట్లాడుతున్న యాతాకుల భాస్కర్‌

నాగర్‌కర్నూల్‌రూరల్‌ : రాష్ట్రంలో పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ అన్నారు. గురువారం పీఆర్‌ అతిథిగహంలో మాట్లాడారు.

నాగర్‌కర్నూల్‌రూరల్‌ : రాష్ట్రంలో పేదలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని టీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ అన్నారు. గురువారం పీఆర్‌ అతిథిగహంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సకల జనుల సమ్మెలో దళితులు ఎంతో కషిచేశారని, డప్పు నత్యాలతో ఉద్యమంలో పాల్గొన్నారని, రాష్ట్రం ఏర్పడితే దళితుల బతుకులు బాగుపడతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
 
      దళిత సంక్షేమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రావాల్సిన బడ్జెట్‌లో దళితుల వాటా సక్రమంగా రావాలన్నారు. సెప్టెంబర్‌ 10నుంచి 70రోజులపాటు ఆత్మగౌరవంతో బతుకుదాం, హక్కులు సాధించుకుందామన్న నినాదంతో బస్సు యాత్ర చేపడుతున్నామని అన్నారు. సమావేశంలో టీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నయ్య, కార్యదర్శులు జయశంకర్, మల్లెపోగు శ్రీను, రాష్ట్ర నాయకులు మొలకలపల్లి నర్సింహ, శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, మహిళా అధ్యక్షురాలు నిరంజనమ్మ, పాలకొండ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement